عَنِ ابْنِ أَبِي مُلَيْكَةَ:
عَنْ بَعْضِ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -قَالَ: أَبُو عَامِرٍ، قَالَ نَافِعٌ: أُرَاهَا حَفْصَةَ- أَنَّهَا سُئِلَتْ عَنْ قِرَاءَةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَتْ: إِنَّكُمْ لَا تَسْتَطِيعُونَهَا قَالَ: فَقِيلَ لَهَا أَخْبِرِينَا بِهَا. قَالَ: فَقَرَأَتْ قِرَاءَةً تَرَسَّلَتْ فِيهَا قَالَ أَبُو عَامِرٍ: قَالَ نَافِعٌ: فَحَكَى لَنَا ابْنُ أَبِي مُلَيْكَةَ {الحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ} [الفاتحة: 2] ثُمَّ قَطَّعَ {الرَّحْمَنِ الرَّحِيمِ} [الفاتحة: 1] ثُمَّ قَطَّعَ {مَالِكِ يَوْمِ الدِّينِ}.
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 26470]
المزيــد ...
ఇబ్న్ అబీ ములైకహ్ ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒక భార్య నుండి ఉల్లేఖన -అబూ ఆమిర్ అన్నారు, నాఫి అన్నారు: నేను ఆమెను హఫ్సా రదియల్లాహు అన్హా అని అనుకుంటున్నాను- ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం గురించి అడగగా ఆమె ఇలా అన్నారు: నిశ్చయంగా మీరు దానిని చేయలేరు. అప్పుడు ఆమెతో, 'దాని గురించి మాకు తెలియజేయండి' అని అనబడింది. అప్పుడు ఆమె ఆగి ఆగి స్పష్టంగా పారాయణం చేసేవారు. అబూ ఆమిర్ అన్నారు: నాఫి అన్నారు: ఇబ్న్ అబీ ములైకా మాకు దానిని చేసి చూపించారు: {అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్} అని పఠించి, ఆ తర్వాత ఆగి, {అర్రహ్మా నిర్రహీమ్} అని పఠించి, ఆ తర్వాత ఆగి, {మాలికి యౌమిద్దీన్} అని పఠించారు.
[ప్రామాణికమైన హదీథు] - [ఆహ్మద్ నమోదు చేసినారు:] - [ముస్నద్ అహ్మద్ - 26470]
విశ్వాసుల మాత హఫ్సా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఖుర్ఆన్ పారాయణం ఎలా ఉండేది?" దానికి ఆమె "మీరు ఆయనలా పఠించలేరు" అని చెప్పగా, మరలా వారు ఆమెతో, "మాకు తెలియజేయండి" అని అన్నారు. నాఫె తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ పారాయణ పద్ధతిని అనుకరించి, వారికి స్పష్టంగా తెలియజేయడానికి ఇబ్నె అబీ ములైక మా కొరకు నెమ్మదిగా పారాయణం చేశారు. ఆయన ఇలా పఠించారు: {అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్} తర్వాత పారాయణాన్ని ఆపారు, {అర్రహ్మానిర్రహీమ్}, తర్వాత పారాయణాన్ని ఆపారు, {మాలికి యౌమిద్దీన్}.