عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
مَا قَاتَلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَوْمًا قَطُّ حَتَّى يَدْعُوَهُمْ.

[صحيح] - [رواه أحمد والبيهقي] - [سنن البيهقي: 18232]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ జాతివారికైనా (అల్లాహ్ వైపు) పిలుపునివ్వకుండా వారితో ఎన్నడూ యుద్ధం చేయలేదు.

[ప్రామాణికమైన హదీథు] - [అహ్మద్ మరియు అల్ బైహిఖీ నమోదు చేసినారు:] - [సునన్ అల్ బైహిఖీ - 18232]

వ్యాఖ్యానము

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలియజేశారు - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదట ఏ జాతినైనా ఇస్లాం వైపునకు ఆహ్వానించనిదే వారితో పోరాటం ఆరంభించలేదు. ఒకవేళ వారు ఆయన ఆహ్వానాన్ని స్వీకరించకపోతే, వారితో పోరాడారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఒక వేళ వారికి ఇస్లాం చేరనట్లయితే, పోరాడటానికి ముందు ఇస్లాం వైపుకు ఆహ్వానించడం ఒక షరతు.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించేవారు, వారు నిరాకరిస్తే వారికి జిజియా చెల్లించమని ప్రతిపాదించేవారు, వారు దానిని కూడా నిరాకరిస్తే వారితో యుద్ధం చేసేవారు, ఇతర హదీథులలో వచ్చినట్లుగా.
  3. జిహాద్ యొక్క వివేకం ప్రజలను ఇస్లాంలోనికి తీసుకురావడమే, వారి ప్రాణాలను తీయడం, వారి సంపదను మరియు వారి దేశాలను కబళించడం ఎంతమాత్రమూ కాదు.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإندونيسية ఇంకా (28)
ఇంకా