عَنْ زِرِّ بْنِ حُبَيْشٍ قَالَ:
أَتَيْتُ صَفْوَانَ بْنَ عَسَّالٍ المُرَادِيَّ، أَسْأَلُهُ عَنِ المَسْحِ عَلَى الخُفَّيْنِ، فَقَالَ: مَا جَاءَ بِكَ يَا زِرُّ؟ فَقُلْتُ: ابْتِغَاءَ العِلْمِ، فَقَالَ: إِنَّ المَلاَئِكَةَ لَتَضَعُ أَجْنِحَتَهَا لِطَالِبِ العِلْمِ؛ رِضًا بِمَا يَطْلُبُ، فَقُلْتُ: إِنَّهُ حَكَّ فِي صَدْرِي المَسْحُ عَلَى الخُفَّيْنِ بَعْدَ الغَائِطِ وَالبَوْلِ، وَكُنْتَ امْرَأً مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجِئْتُ أَسْأَلُكَ: هَلْ سَمِعْتَهُ يَذْكُرُ فِي ذَلِكَ شَيْئًا؟ قَالَ: نَعَمْ، كَانَ يَأْمُرُنَا إِذَا كُنَّا سَفْرًا أَوْ مُسَافِرِينَ أَلَّا نَنْزِعَ خِفَافَنَا ثَلاَثَةَ أَيَّامٍ وَلَيَالِيهِنَّ إِلَّا مِنْ جَنَابَةٍ، لَكِنْ مِنْ غَائِطٍ وَبَوْلٍ وَنَوْمٍ، فَقُلْتُ: هَلْ سَمِعْتَهُ يَذْكُرُ فِي الهَوَى شَيْئًا؟ قَالَ: نَعَمْ، كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفَرٍ فَبَيْنَا نَحْنُ عِنْدَهُ إِذْ نَادَاهُ أَعْرَابِيٌّ بِصَوْتٍ لَهُ جَهْوَرِيٍّ: يَا مُحَمَّدُ، فَأَجَابَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى نَحْوٍ مِنْ صَوْتِهِ: «هَاؤُمُ» وَقُلْنَا لَهُ: وَيْحَكَ اغْضُضْ مِنْ صَوْتِكَ، فَإِنَّكَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ نُهِيتَ عَنْ هَذَا، فَقَالَ: وَاللَّهِ لاَ أَغْضُضُ، قَالَ الأَعْرَابِيُّ: المَرْءُ يُحِبُّ القَوْمَ وَلَمَّا يَلْحَقْ بِهِمْ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «المَرْءُ مَعَ مَنْ أَحَبَّ يَوْمَ القِيَامَةِ»، فَمَا زَالَ يُحَدِّثُنَا حَتَّى ذَكَرَ بَابًا مِنْ قِبَلِ المَغْرِبِ مَسِيرَةُ عَرْضِهِ، أَوْ يَسِيرُ الرَّاكِبُ فِي عَرْضِهِ أَرْبَعِينَ أَوْ سَبْعِينَ عَامًا.
المزيد
జిర్ ఇబ్న్ హుబైష్ ఉల్లేఖన:
నేను మేజోళ్ళపై మసహ్ గురించి అడుగుదామని సఫ్వాన్ బిన్ అస్సాల్ అల్-మురాదీ వద్దకు వెళ్ళాను. ఆయన నన్ను "జిర్! ఏమిటి ఇలా వచ్చావ్?” అనడిగారు. అందుకు నేను “జ్ఞానసముపార్జన కోసం” అని జవాబిచ్చాను. అది విని ఆయన “దైవదూతలు జ్ఞానం ఆర్జించే వ్యక్తి పట్ల ప్రసన్నులై తమ రెక్కల్ని పరుస్తారు" అని చెప్పారు. నేను ఆయనతో "మల మూత్ర విసర్జన అనంతరం మేజోళ్ళపై మసాహ్ చేసే విషయంలో నాకు సందేహముంది. తమరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు కదా! అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి బోధిస్తుండగా మీరేమైనా విన్నారేమో అడుగుదామని వచ్చాను” అని విన్నవించుకున్నాను. దానికి ఆయన "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు జనాబత్ అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జన మరియు నిద్ర కారణంగా మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు, అని వివరించారు. ఆ తరువాత నేను “మరి ప్రేమ (అభిమానం) గురించి ఆయన ఏమైనా ప్రబోధిస్తుండగా మీరు విన్నారా?” అనడిగాను. దానికి కూడా ఆయన “అవును, ఒకానొక ప్రయాణంలో మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఆయన దగ్గరే ఉన్నాము. అప్పుడు పల్లెటూరి వ్యక్తి ఒకడు ‘ఓ ముహమ్మద్!' అని బిగ్గరగా అరిచాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతే స్వరంతో “ఇక్కడున్నాను" అని బదులు పలికారు. మేము అతనికి, “నీ ధోరణి కడు శోచనీయం. కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉన్నావు. ఆయన సమక్షంలో నువ్విలా బిగ్గరగా మాట్లాడటం నిషిద్ధం” అని హితవు పలికాము. కాని అతను "దైవసాక్షి! నేను తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి “మనిషి కొందరిని ప్రేమిస్తాడు, కానీ వారిని కలుసుకోలేకపోతాడు” అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను ప్రేమించిన వారితో పాటే ఉంటాడు” అని చెప్పారు. తరువాత ఆయన మాతో మాట్లాడుతూ పడమటి దిక్కున ఉన్న ఓ ద్వారాన్ని గురించి ప్రస్తావించారు. దాని వెడల్పు నలభై లేక డెభ్భై సంవత్సరాల ప్రయాణమంత ఉంటుంది లేదా దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు.