عَنْ أبي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ أَنَّ جَابِرَ بْنَ عَبْدِ اللَّهِ الأَنْصَارِيِّ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: وَهُوَ يُحَدِّثُ عَنْ فَتْرَةِ الوَحْيِ، فَقَالَ فِي حَدِيثِهِ:
«بَيْنَا أَنَا أَمْشِي إِذْ سَمِعْتُ صَوْتًا مِنَ السَّمَاءِ، فَرَفَعْتُ بَصَرِي، فَإِذَا المَلَكُ الَّذِي جَاءَنِي بِحِرَاءٍ جَالِسٌ عَلَى كُرْسِيٍّ بَيْنَ السَّمَاءِ وَالأَرْضِ، فَرُعِبْتُ مِنْهُ، فَرَجَعْتُ فَقُلْتُ: زَمِّلُونِي، فَأَنْزَلَ اللَّهُ تَعَالَى: {يَا أَيُّهَا المُدَّثِّرُ1 قُمْ فَأَنْذِرْ} [المدثر: 2] إِلَى قَوْلِهِ {وَالرُّجْزَ فَاهْجُرْ} [المدثر: 5]. فَحَمِيَ الوَحْيُ وَتَتَابَعَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4]
المزيــد ...
అబూ సలమ బిన్ అబ్దుర్రహ్మాన్ ఉల్లేఖన, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్-అన్సారీ రదియల్లాహు అన్హుమా దైవవాణి (వహీ) గురించి వివరిస్తూ ఇలా పలికినారు - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత భూమికి మరియు ఆకాశానికి మధ్య ఒక కుర్చీపై కూర్చుని ఉన్నాడు. నేను అతనిని చూసి భయపడ్డాను. నేను తిరిగి వచ్చి ఇలా అన్నాను: నాపై దుప్పట కప్పండి. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు: {ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!1 లే! ఇక హెచ్చరించు!} [ముద్దస్సిర్: 2] నుండి {మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!} [ముద్దస్సిర్: 5] ఈ ఆయతు వరకు. ఆ తర్వాత దైవవాణి అవతరణ ప్రక్రియ గొప్ప శక్తితో మరియు నిరంతరం కొనసాగింది».
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 4]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవక్త పదవి ప్రారంభంలో వహీ (దైవవాణి) అవతరించడం ఆగిపోవడం గురించి వివరిస్తూ ఇలా తెలిపారు: నేను మక్కా వీధులలో నడుస్తుండగా, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. నేను నా దృష్టిని పైకి ఎత్తి చూశాను, అక్కడ హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత జిబ్రయీల్, ఆకాశం మరియు భూమి మధ్య ఒక కుర్చీపై కూర్చుని ఉన్నారు. ఆయనను చూసి నేను భయభ్రాంతులకు గురయ్యాను, వెంటనే నా ఇంటివారి వద్దకు తిరిగి వెళ్లి, "నన్ను దుప్పటితో కప్పండి" అని అన్నాను. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేశాడు: {ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!} అంటే తన వస్త్రంలో చుట్టుకున్నవాడా, {లే!} ప్రబోధన కొరకు. {ఇక హెచ్చరించు} నీ సందేశాన్ని విశ్వసించని వారిని. {మరియు మీ ప్రభువు} మరియు మీ ఆరాధ్య దైవాన్ని {గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)} మరియు ఆయనను ప్రశంసించు మరియు ఆయన ఘనత ప్రకటించు. {وَثِيَابَكَ} అనగా నీ వస్త్రాలను {فَطَهِّرْ} మాలిన్యాల నుండి పరిశుభ్రంగా ఉంచుకో, {وَالرُّجْزَ} అనగా విగ్రహాలు మరియు ప్రతిమల ఆరాధనను {فَاهْجُرْ} వదిలివేయి, ఆ తర్వాత కాలంలో దైవవాణి (వహీ) బలపడి, అధికమైంది (తరచుగా అవతరించడం మొదలైంది).