عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«قَالَ اللَّهُ تَعَالَى: ثَلاَثَةٌ أَنَا خَصْمُهُمْ يَوْمَ القِيَامَةِ: رَجُلٌ أَعْطَى بِي ثُمَّ غَدَرَ، وَرَجُلٌ بَاعَ حُرًّا فَأَكَلَ ثَمَنَهُ، وَرَجُلٌ اسْتَأْجَرَ أَجِيرًا فَاسْتَوْفَى مِنْهُ وَلَمْ يُعْطِهِ أَجْرَهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2270]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: మూడు రకాల వ్యక్తులతో ప్రళయదినాన నేను స్వయంగా గొడవ పడతాను: ఒకడు నా పేరు మీద వాగ్దానం చేసి మోసం చేసినవాడు, మరొకడు స్వేచ్ఛాపరుణ్ణి అమ్మి ఆ డబ్బు తిన్నవాడు మరియు ఇంకొకడు ఒక మనిషిని కూలికి పెట్టుకొని అతనితో బాగా పని చేయించుకుని కూలి ఇవ్వకుండా ఎగవేసినవాడు.”
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ నమోదు చేసినారు:] - [సహీహ్ అల్ బుఖారీ - 2270]
మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: (అల్లాహ్ పలుకులు) "పునరుత్థాన దినమున నేను మూడు రకాల వ్యక్తులకు విరోధిగా ఉంటాను మరియు నేను ఎవరికైతే విరోధిగా ఉంటానో, అతనిని ఓడించివేస్తాను": మొదటిది: ఎవరైతే అల్లాహ్ పై ప్రమాణం చేసి, ఒడంబడిక చేసుకుని, ఆ తర్వాత దానిని ఉల్లంఘించి ద్రోహం చేస్తాడో. రెండవవాడు: ఒక స్వతంత్రుడైన వ్యక్తిని బానిసగా అమ్మి, ఆ సొమ్మును తిని, దాని విలువను వాడుకున్నవాడు. మూడవది: ఒక మనిషిని కూలికి పెట్టుకుని, అతనితో పూర్తిగా పని చేయించుకుని, అతనికి కూలి ఇవ్వనివాడు.