«يقالُ لصاحبِ القرآن: اقرَأ وارتَقِ، ورتِّل كما كُنْتَ ترتِّل في الدُنيا، فإن منزِلَكَ عندَ آخرِ آية تقرؤها».
[حسن] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وأحمد] - [سنن أبي داود: 1464]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు :
“(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది.
[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 1464]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ప్రాపంచిక జీవితములో ఎవరైతే ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉంటాడో, అందులో ఉన్న దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటాడో, మరియు తాను పఠిస్తున్న దానికి, తాను కంఠస్థం చేసిన దానికి కట్టుబడి ఉంటాడో, అతడు స్వర్గములో ప్రవేశించిన తరువాత అతనితో ఇలా అనడం జరుగుతుంది “ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉండు మరియు స్వర్గములో ఉన్నత స్థానములను అధిరోహిస్తూ ఉండు. ప్రపంచములో ఏ విధంగానైతే నీవు హృద్యంగా పఠించేవాడివో, (పఠిస్తున్న దానిలో) ఏ విధంగానైతే పూర్తి భరోసా మరియు నమ్మకముతో పఠించే వానివో అలా పఠించు. నీవు పఠించే చివరి ఆయతే నీ నివాస స్థానము అవుతుంది.
أهمية العمل بالقرآن وتدبره.
أهمية العمل بالقرآن وتدبره.Quraner fajilot